![]() |
![]() |
.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -153 లో......చక్రి, కేశవ ఇద్దరు కలిసి శైలు ఇంటికి వెళ్తారు. ఏంటే మీ అన్న మా ఇంటికి గొడవకు వచ్చాడని శైలుతో కేశవ అంటాడు. అప్పుడే శైలు అమ్మనాన్న వస్తారు. ఎంత ధైర్యం ఉంటే మా ఇంటికి వస్తారని శైలు వాళ్ళ నాన్న చక్రి, కేశవల మీద కోప్పడతాడు. అప్పుడే సురేష్ వస్తాడు. ఏంట్రా ఇంటికి వచ్చి మీదొక లాడ్జి అంటూ ఇష్టం వచ్చినట్లు మాట్లాడావటా అని చక్రి తనని కొడతాడు. ఇంకొకసారి మా అమ్మాయి వెంటపడొద్దని శైలు వాళ్ళ అమ్మ అంటుంది. నీ కూతురే నా వెంట పడిందని కేశవ అంటాడు. శైలు వచ్చి పెళ్లి చేసుకుంటానని నా తమ్ముడితో చెప్తే చెయ్యడానికి రెడీగా ఉన్నాను.ఇప్పుడు శైలు మా ఇంటి ఆడపిల్ల తనని ఎవరైన ఏమైనా అంటే అసలు ఊరుకోనని చక్రి అందరికి వార్నింగ్ ఇస్తాడు.
ఆ తర్వాత చక్రి, కేశవ ఇంటికి వెళ్తారు. ఎక్కడికి వెళ్ళారురా అని మాధవ అడుగుతాడు. జాగింగ్ కి అని కేశవ, చక్రి అబద్ధం చెప్తారు. కానీ మాధవ కనిపెడతాడు.ఆ తర్వాత శైలు పేరెంట్స్ నారాయణ ఇంటికి వస్తారు. మీ వాళ్ళు మా ఇంటికి వచ్చి గొడవ చేసారని కోప్పడతారు. లోపలికి వెళ్లి మాట్లాడుకుందాం రండి అని మాధవ అనగానే మేం సంబంధం పెట్టుకోవడానికి రాలేదని వరాలు అంటుంది. ఇంటి గురించి తప్పుగా మాట్లాడుతుంది. ఈ ఇంటికి ఎవరైనా కోడలిగా వస్తుందా.. ఈ ఇంటికి శాపం ఉందని వరాలు అంటుంటే అప్పుడే మహా ఎంట్రీ ఇస్తుంది. ఏం మాట్లాడుతున్నారు.. ఇక్కడ ఎవరు ఉండరా నేను ఉంటున్నాను కదా.. నేను ఈ ఇంటికి కోడలు.. చక్రి భార్యని అని మహా అంటుంటే చక్రి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. మా కేశవ మీ అమ్మాయిని బంగారంలాగా చూసుకుంటాడు అంతేగానీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంటే అసలు ఊరుకోనని మహా వాళ్ళకి వార్నింగ్ ఇస్తుంది.
ఆ తర్వాత అందరు ఇంట్లోకి వస్తారు. మహాని చూసి అందరు బాగా మాట్లాడిందని అనుకుంటారు. ఆ తర్వాత బండోడు, మొండోడు అని మహా అంటుంది. దాంతో మా వెనకాల ఇలా మాట్లాడుకుంటున్నారా అని కేశవ అంటాడు. అయితే వాళ్ళ పేరు ఏంటని చక్రి అనగానే పెద్దోడు చిన్నోడు అని మహా అంటుంది. ఆ తర్వాత శైలు, సురేష్ గొడవ పడుతుంటే వాళ్ళ పేరెంట్స్ ఇంటికి వస్తారు. వాళ్లని ఆపుతారు. శైలుకి ఇంట్లో వాళ్ళు వార్నింగ్ ఇస్తారు. తరువాయి భాగంలో శైలు, కేశవ పార్క్ కి వెళ్తారు. మహా, చక్రి కూడా వెళ్తారు. అక్కడికి మనీషా మాధవ కూడా వెళ్తారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |